top of page
Search

నారాయణపేట జిల్లాలో పలు ప్రగతి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నారాయణపేట జిల్లాలో పలు ప్రగతి పనులకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సహచర మంత్రులు సీతక్క, పొంగులేటి, దామోదర రాజనర్సింహా గార్లతో కలిసి జూపల్లి కృష్ణారావు గారు

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా బంగలి దేవమ్మ గారి ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టారని తెలిపారు. వచ్చే నాలుగేండ్లతో పాటు ఆపైన ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేండ్లలో ఎంతో చేశామని చెప్పుకుంటున్న నేతల కంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పదింతలు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారని మంత్రి తెలిపారు. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్... జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పి అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. 2014 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో అప్పగించిన రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లారని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా ప్రజల అదృష్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అభిప్రాయపడ్డారు. జురాల, బీమా, నెట్టేంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు రిజర్వాయర్లు నిర్మించి పాలమూరు ప్రజలకు, రైతులకు కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. గడచిన పదేండ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను సీఎం భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారని వెల్లడించారు. గత పదేండ్లుగా బయటకు రాని కేసీఆర్... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైపోయిన కేసీఆర్‌కు ఇక అధికారం కలేనని జోస్యం చెప్పారు. కుటుంబ పరిపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే గాక ఇప్పుడు వారికి వత్తాసు పలికే పత్రికలు, టీవీ ఛానళ్లలో ఊదరగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



 
 
 

Comments


bottom of page